Sunday, April 20, 2025

డ్రైవర్ నిద్రమత్తు.. విమానాన్ని ఢీకొట్టిన టెంపో

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కెంపెగౌడ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని టెంపో ఢీకొన్ని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఒక్కడే టెంపోలో ఉన్నాడు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. ఈ టెంపో ఆకాశ ఎయిర్ సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ బేకి తీసుకువచ్చేందుకు వినియోగిస్తారని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పలు విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దీనిపై ఇండిగో విమానయాన సంస్థ స్పందించింది. జరిగిన ఘటనపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు సమాచారం అందించినట్లు తెలిపింది. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News