Thursday, January 23, 2025

వంతెన పైనుంచి వాగులో పడిన టెంపో: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

బూర్గంపాటు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటు వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి వాగులో పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News