Monday, December 23, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో టెంపో వాహనం బోల్తా

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్ 4వ మలుపు వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఓ టెంపో వాహనం బోల్తా పడింది. వాహనం అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ఉన్నారు. క్షతగాత్రులంతా చెన్నై వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News