Thursday, January 23, 2025

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టెంపో వాహనం బోల్తా…..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్ ఆరో మూలమలుపు వద్ద టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కర్నాకటలోని కోలార్‌కు చెందిన వెంకటేశ్వర స్వామి భక్తులు తిరమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు వెల్లడించారు. డ్రైవర్ మొబైల్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిందని భక్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని టిటిడి ఇఒ ఆదేశించారు. ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు టిటిడి ఇఒ ఆదేశాలు జారీ చేశారు. ఘాట్‌రోడ్డులో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: చంద్రబాబు 420, ఔరంగజేబు: కొడాలి నాని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News