Saturday, November 16, 2024

హారిస్‌కు తాతాల్కిక అధ్యక్ష బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

Temporarily to Kamala Harris Duties of President of US

 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బదిలీ చేయనున్నారు. అయితే ఇది తాత్కాలికమే. బైడెన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలయిన కమలా బదిలీ చేయనున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్‌కు ప్రతి ఏటా కొలనోస్కోపీ నిర్వహిహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరీక్ష నిర్వహించడం ఇదే మొదటి సారి. అందువల్ల ఆ సమయంలో కమలా హారిస్‌కు తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు శ్వేత సౌధం తెలిపింది. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా మారిస్ రికార్డు సృష్టించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News