Monday, December 23, 2024

ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ తాత్కాలికంగా పోలండ్‌కు తరలింపు

- Advertisement -
- Advertisement -

Temporary relocation of Indian Embassy in Ukraine to Poland

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా సమీపంలోని పోలండ్‌కు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అన్ని నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిసున్న దృష్టా భారత రాయబార కార్యాలయాన్ని సమీపంలోని పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించాం’ అని భారత విదేశాంగ శాఖ దివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే పరిణామాలను బట్టి పరిస్థితులను తిరిగిఅంచనా వేయడం జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది.

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ భూభాగంనుంచి భారతీయులను సురక్షితంగా తరలించే కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 20 వేలమంది భారతీయులను ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం కింద భారత్‌కు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారుల్లో చాలా మంది లెవివ్‌లోని క్యాంప్ కార్యాలయంనుంచి ఇప్పటికే పని చేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను భూతల సరిహద్దు క్రాసింగ్‌లగుండా తరలించే కృషిలో భాగంగా లెవివ్‌లో భారత దౌత్యకార్యాలయం క్యాంప్ ఆఫీస్‌ను ఏరాటు చేయడం జరిగింది. లెవివ్ పోలండ్ సరిహద్దుకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News