Saturday, April 5, 2025

పుణెలో పేలిన 10 వంట గ్యాస్ సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

పుణె : మహారాష్ట్రలోని పుణెలో బుధవారం పది వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నగరంలోని విమాన్ నగర్‌లో బుధవారం మధ్యాహ్నం 2.45, 3 గంటల మధ్య ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరికీ గాయాలు కాలేదని ఆ అధికారి తెలిపారు. సిలిండర్ల పేలుడుకు కారణాలు వెంటనే తెలియరాలేదు. నిర్మాణ కార్మికుల గుడిసెల సమీపాన ఒక రేకుల షెడ్‌లో దాదాపు 100 సిలిండర్లు ఉంచారని ఆయన తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ల పేలిన తరువాత ప్రజ్వరిల్లిన మంటలను ఆర్పివేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను ఆ ప్రదేశానికి పంపినట్లు ఆయన తెలిపారు. పేలుడుకు కారణం నిర్ధారించేందుకు దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News