- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి రాజదాని కరోనా ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. భాండప్ ప్రాంతం ఓ మాల్‌లోని మూడో అంతస్తులో సన్‌రైజ్ ఆస్పత్రి ఉంది. మాల్‌లో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకోవడంతో పది మంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. మొదటి అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు చేరుకున్నాయి. స్థానికుల సమాచార మేరకు 25 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఫైర్ అలారం మోగడంతో 76 మంది రోగులను సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. మాల్‌లో ఆస్పత్రి నడిపించేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముంబయి మేయర్ కిషోరీ పడ్నేకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
- Advertisement -