Tuesday, September 17, 2024

ఉత్తర సైప్రస్‌లో చిక్కుకున్న 10మంది భారత నావికులు

- Advertisement -
- Advertisement -
Ten Indian Sailors Stuck On Ship In Northern Cyprus
కేంద్రం జోక్యానికి కాంగ్రెస్ నేత చర్మేశ్‌శర్మ విజ్ఞప్తి

కోట: ఉత్తర సైప్రస్ ఓడరేవులో 10మంది భారత నావికులు నెలరోజులుగా చిక్కుకున్నారని, కేంద్రం జోక్యం చేసుకొని వారిని స్వదేశానికి తీసుకురావాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత చర్మేశ్‌శర్మ విజ్ఞప్తి చేశారు. ఓడ నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారని, వీరితోపాటు 13మంది సిబ్బంది కూడా ఉన్నారని ఆయన తెలిపారు. భారత్ నుంచి వెళ్లిన నావికులు వ్యాపారులని ఆయన తెలిపారు. ఓడను యజమాని మరొకరికి అమ్మడంతో ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. ఓడను అంతర్యుద్ధ ప్రాంతమైన లిబియాకు తరలించాలని సిబ్బందిపై నూతన యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆయన తెలిపారు.

బాధితుల్లో ఒకరు రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌సింగ్ రాథోడ్. ఆయన తన భార్యకు వాట్సాప్ ద్వారా శనివారం ఓ సందేశం పంపారు. దాని ప్రకారం వారు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సరిపడినంత ఆహారం కూడా ఇవ్వడంలేదని సింగ్ తన భార్య శ్వేతకు తెలిపారు. మరోవైపు పోర్టు అధికారులు వారి మొబైల్ నెట్‌వర్క్‌తోపాటు ఇంటర్‌నెట్ కనెక్షన్లను బ్లాక్ చేస్తామని తెలిపారని శ్వేత ఆందోళన వ్యక్తం చేసినట్టు శర్మ తెలిపారు. వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రిత్వశాఖను శర్మ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News