Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో పది మంది కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో పది మంది కూలీలు మృతిచెందిన సంఘటనా ఉత్తర్ ప్రదేశ్ రాష్రం మీర్జాపూర్ లో చోటు చేసుకుంది. వారణాసి- ప్రయాగ్ రాజ్ హైవేపై ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 10 మంది కూలీలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం కట్కా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని, ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News