Friday, January 10, 2025

మూడు రోజుల్లో రూ.10 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
ఐటి, రియల్టీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 1,041 పాయింట్లు జంప్

Sensex ends above 59K, up 418 points

 

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా రియ ల్టీ, ఐటి స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు మార్కెట్లకు ద న్నుగా నిలిచాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1041 పాయింట్లు (1.90 శాతం) లాభం తో 55,925 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇండెక్స్ 308.95 పాయింట్లు (1.89 శాతం) లాభంతో 16,661 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో తరచూ పతనమవుతున్న నేపథ్యంలో సోమవారం మంచి కొనుగోళ్లు జరిగాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది. అయితే వరుసగా మూడు రోజుల లాభాల తో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద రూ.10.19 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ మూడు రోజుల్లో రూ.10.19 లక్షల కోట్లు పెరగడంతో మొత్తం రూ.258.47 కోట్లకు చేరిం ది. సెన్సెక్స్ టాప్ -30 షేర్లలో కేవలం 4 స్టాక్స్ మా త్రమే నష్టపోయాయి. అయితే పెరిగిన 26 స్టాక్స్‌లో మంచి వృద్ధి కనిపించింది. కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా 2 శాతం పతనమయ్యాయి. ఆ తర్వాత సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఐటిసి షేర్లలో కూడా అమ్మకాలు కనిపించాయి. ఇది కాకుండా టైటాన్, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్‌టి, టెక్ మ హీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్, రిలయన్స్, అల్ట్రా కెమికల్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్సింద్ బ్యాంక్ బుల్లిష్ జాబితాలో ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్‌తో సహా 26 స్టాక్స్‌లో మంచి కొనుగోళ్లు కనిపించాయి. రోజంతా మార్కెట్‌లో మంచి కొనుగోళ్ల తర్వాత అన్ని రంగాలు గ్రీ న్ మార్క్‌లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి, నిఫ్టీ ఐటి, మీ డియా, మెటల్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్, ప్రైవే ట్ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News