Monday, December 23, 2024

భారతీయులకు పది లక్షల అమెరికా వీసాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో పదిలక్షలకు పైగా అమెరికా వీసాల జారీ చేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉండివచ్చేందుకు వీలైన నాన్ ఇమిగ్రేంట్ వీసాల జారీ విషయంలో ఇక్కడి అమెరికా ఎంబస్సీ ఈ ఏడాది తన లక్షాన్ని ఇప్పటికే అధిగమించింది. పది లక్షల వీసాల జారీ మైలురాయిని చేరింది. ఇక్కడి అమెరికా రాయబారి ఎరిక్ గర్సెటీ వ్యక్తిగతంగా ఈ మిలియనవ వీసాను భారతీయ దంపతులకు అందచేసేందుకు కార్యక్రమం ఏర్పాటు అయింది. ఈ ఏడాది పదిలక్షల మంది భారతీయులకు వలసేతర వీసాల జారీకి అమెరికా రాయబార కార్యాలయం లక్షంగా పెట్టుకుంది. ఈ ఏడాది ముగియడానికి రెండు మూడు నెలల ముందే ఈ లక్షాన్ని చేరుకున్నట్లు ఎంబసీ తెలిపింది. లేడీ హర్డింగే కాలేజ్‌లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ రంజు సింగ్‌కు యుఎస్ ఎంబసీ నుంచి ఇ మొయిల్ అందింది.

ఇందులో ఆమె, ఆమె భర్త పునీత్ దర్గన్ ఒన్‌మిలియన్ నెంబరు వీసా పొందారని తెలిపారు. ఈ దంపతులు అమెరికాలోని మిట్‌లో తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాది మే నెలలో అమెరికాకు వెళ్లుతారు. తమకు అమెరికా ఎంబసీ నుంచి ఈ లేఖ అందడం తాము పదిలక్షల మైలురాయి వీసా గౌరవం దక్కించుకోవడం సంతోషంగా ఉందని డాక్టర్ రంజుసింగ్ తెలిపారు. పదిలక్షల వీసాల రికార్డును స్థాపించడం తనకే కాకుండా ఇండియాకు, అమెరికాకు ఎంతో సంతోషకరమైన విషయం అని, ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ జో బైడెన్ వీసాల జారీలో మరింత వేగంగా వ్యవహరించాలని నిర్ణయించారని అమెరికా రాయబారి తెలిపారు. దీని వల్లనే ఇప్పుడు హైదరాబాద్ వంటి చోట్ల వీసాల జారీకి ఆమోదం వచ్చిందని , దీనితో అత్యధిక సంఖ్యలో ఈ వీసాల జారీకి మార్గం ఏర్పడిందన్నారు. అమెరికాలోని పిల్లల వద్దకు వెళ్లేవారికి, వైద్యచికిత్సలకు, సందర్శనకు ఈ తాత్కాలిక వీసాలు జారీ చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News