Friday, November 15, 2024

మా కుటుంబంలో పది మందికి కరోనా: డింపుల్

- Advertisement -
- Advertisement -

Ten members corona positive in Family

హైదరాబాద్: సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఏ ఆస్పత్రిలో చూసిన కరోనాతో చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. గత పది రోజుల నుంచి దేశంలో రోజుకు నాలుగు వేలకు పైగా మంది మరణిస్తున్నారు. మా ఇంట్లో పది మంది కరోనా వైరస్ సోకిందని హీరోయిన్ డింపుల్ హయాతి తెలిపింది. కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాతయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో అందరికి ఒకేసారి కరోనా వైరస్ దాడి చేసిందన్నారు. తనపై చాలా ఒత్తిడి ఉందని, తగ్గించుకునేందకు ప్రయత్నిస్తున్నానని, గత వారం రోజుల నుంచి శారీరకంగా, మానసికంగా కష్టాన్ని ఎదుర్కొంటున్నానని చెప్పింది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో లాక్‌డౌన్ ఉండడంతో తాను హైదరాబాద్ లో ఉండిపోయానని డింపుల్ చెప్పింది. ‘గద్దల కొండ గణేష్’ చిత్రంలో వరణ్ తేజ్ సరసన ఆమె నటించింది. ప్రస్తుతం రవితేజతో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్‌లో హీరో విశాల్‌తో మరో సినిమాలో నటిస్తోందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News