Monday, January 20, 2025

హమాస్ దాడికి 10 మంది నేపాల్ విద్యార్థుల బలి

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్ : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో నేపాల్ విద్యార్థులు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాజా స్ట్రిప్ సమీపాన కిబ్బుట్జ్ అల్యూమిమ్ వద్ద ఒక వ్యవసాయ క్షేత్రంలో 17 మంది నేపాలీలు పని చేస్తున్నారని, హమాస్ దాడి నుంచి ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారని, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, మరొకరు గల్లంతయ్యారని నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. హమాస్ దాడికి బలైన పదిమంది విద్యార్థులు పశ్చిమనేపాల్ లోని సుదుర్ పశ్చిమ్ యూనివర్శిటీ లోని వ్యవసాయ శాస్త్ర విద్యార్థులని వివరించింది. ప్రస్తుతం 4500 మంది నేపాలీలు ఇజ్రాయెల్‌లో కేర్‌టేకర్లుగా పనిచేస్తున్నారు.

మొత్తం 265 మంది నేపాల్ విద్యార్థులు ఇజ్రాయెల్ ప్రభుత్వ లెర్న్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కింద చదువుతున్నారు. వీరిలో 119 మంది అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీలో, 97 మంది త్రిభువన్ యూనివర్శిటీలో, 49 మంది సుదుర్ పశ్చిమ యూనివర్శిటీలో చదువుతున్నారు. హమాస్ దాడిలో చనిపోయిన వారిని గుర్తించడానికి, అలాగే గల్లంతైన మరో విద్యార్థి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని నేపాల్ రాయబార కార్యాలయం వెల్లడించింది. గాయాలతో చికిత్స పొందుతున్న వారికి వీలైనంతవరకు కావలసిన సాయం అందించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని నేపాల్ అర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News