Wednesday, January 22, 2025

ఉగ్రదాడి… పది మంది సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్థాన్ ప్రావిన్స్‌ కెచ్ జిల్లాలో ఓ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. మెరుపు వేగంతో ఉగ్రవాదులు బాంబుల వర్షం కురిపించడంతో పది మంది సైనికులు మృతి చెందారు. సైన్యం ఎదురుదాడి చేయడంతో ఒక ఉగ్రవాది చనిపోయాడని పలువురు ఉగ్రవాదలును పట్టుకున్నామని అధికారి వెల్లడించారు. ఈ దాడి తామే బాధ్యులమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. బలూచిస్థాన్‌లోని ప్రావిన్స్ ప్రాంతం ఇరాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కొంత కాలంగా హింస చెలరేగుతోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు పని చేస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య పోరు జరుగుతోంది. జనవరి 5న జరిగిన ఉగ్రదాదిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా పలువురు ఉగ్రవాదులు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News