Sunday, January 5, 2025

బైక్ ట్యాంకర్ పేలీ పదిమందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

బైక్ ట్యాంకర్ పేలడంతో పదిమంది గాయపడిన సంఘటన నగరంలోని భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్‌పురలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఇద్దరు యువకులు బైక్‌పై వస్తుండగా మొఘల్‌పుర అస్లాం ఫంక్షన్ హాల్ సమీపంలోకి రాగానే బైక్‌లో నుంచి మంటలు వచ్చాయి. వెంటనే బైక్‌ను ఆపి ఆర్పేందుకు యత్నిస్తుండగా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో అక్కడే చుట్టుపక్కల ఉన్న పదిమందికి గాయాలయ్యాయి.

వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కసారిగా బైక్ పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు పేలుడుకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బైక్‌ను రెగ్యులర్‌గా మేయింటెనెన్స్ చేయకపోవడం వల్లే పేలవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News