Monday, December 23, 2024

రూ. లక్ష కోట్లతో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫార్మా రంగాల్లో సవాళ్లను తాము అర్థం చేసుకోగలమన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌ఐసిసిలో 21వ బయో ఆసియా 2024 సదస్సును సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జీవ వైద్య, సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తామని, హైదరాబాద్ ఎన్నో పరిశోధనలకు నిలయంగా మారిందన్నారు. రూ. లక్ష కోట్లతో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని, వికారాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఫార్మ కంపెనీల ప్రతినిధులు, తదితరలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News