వనపర్తి : తొమ్మిదేళ్లలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ ం సాధించిన విజయాలే దశాబ్ది పండుగలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా, అంకాయిపల్లి తండా, దొడగుంటపల్లి, చిన్నమందడి, ముందరితండా, చీకటిచెట్టు తండా వీరాయిపల్లి, స్కూల్ తండా, వెల్టూరు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రా లు శంకుస్థాపన, మండల పరిషత్ పాఠశాల భవనాల ప్రారంభం, సిసి, ఆర్‌అండ్ బి రహదారులు, డ్రైన్లు, అంగన్వాడి వంట గది నిర్మాణానికి జెడ్పి చై ర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఒకనాడు కరెంటు లేదు నేడు 24 గంటల కరెంట్, ఒకనాడు మంచినీళ్లు లేవు నేడు ఇంటింటికీ నల్లా నీళ్లు, గతంలో పంట పం డితే అమ్ముకునే పరిస్థితి లేదు నేడు ఇంటి ము ందుకు వచ్చి ప్రభుత్వం ధాన్యం కొంటుంది, ఒకనాడు రహదారులు లేవు నేడు బ్రహ్మాండమైన రహదారులు వేసుకున్నాం, ఒకనాడు వైద్య సౌకర్యాలు కరువు నేడు మన జిల్లా కేంద్రంలోనే వైద్య కళాశా ల, 600 పడకల ఆసుపత్రి నిర్మించుకుంటున్నామ ని అన్నారు. తెలంగాణ పల్లెల్లో ప్రజలు నాణ్యమైన జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు.
అన్ని గ్రామాలలో శాశ్వత వసతులు కల్పించి ప్రజల కనీస అవసరాలు తీర్చి నాణ్యమైన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ లక్షమని అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందిస్తున్నామన్నారు. గ్రామా లు పసిడి పంటలతో విలసిల్లాలని అన్నారు. నూత న గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాటు నూతన భవనాలు నిర్మించుకుంటున్నామన్నారు. ప్రతి రెం డు, మూడు గ్రామాలకు ఒక పల్లె దవాఖానా, గ్రా మాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉ న్నత పాఠశాలలు ఆధునీకరించి విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. రూ. 25 లక్షలతో చిన్నమందడి పాఠశాల ఆధునీకరణ చేశామని తెలిపారు.
రాష్ట్రంలో 29 వేల పాఠశాలలు, గత ప్రభుత్వాల నిర్లక్షం సర్కారు బడులపై విశ్వాస ం కోల్పోయిన ప్రజలు ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపారని, కానీ తెలంగాణ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.కార్పొరేట్ పాఠశాలలకు దీ టుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామ న్నారు. ప్రజల సంపాదనలో విద్య, వైద్యానికే ఎక్కు వ ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల సంపాదనలో వి ద్య, వైద్యానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంపాదనలో విద్య, వైద్యానికే ఎక్కువ ఖ ర్చు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ బడులకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలు నిలపాలని తెలంగాణ ప్రభుత్వ ం మన ఊరు మనబడితో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందన్నారు.
గ్రామాలలోనే అందరికీ ఉపాధి లభించడంతో తల్లిదండ్రులు సంతోషంగా పిల్లలను చదివించుకుంటున్నారన్నారు. గురుకుల పాఠశాలలలో సీట్లు దొరకని పరిస్థితి, సర్కారు బడుల విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి సర్కారు పాఠశాలల విద్యార్థులకు అండగా నిలుస్తుందన్నారు. పల్లె లు, పట్టనానికి అంతరాలు లేకుండా చూస్తున్నామ ని, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం అందుబాటులోకి తేవడం మూలంగా పల్లె జీవనానికి ప్రజ లు ఇష్టపడుతున్నారన్నారు. సాంఘిక, ఆర్థిక జీవన ప్రమాణాలలో ఇది ముఖ్యమైనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజప్రకాశ్ రెడ్డి, సీనియర్ నాయకులు విట్టా శ్రీనివాస్ రెడ్డి, మన్నెపు రెడ్డి, గొర్రెల పుంపకదారుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, డైరెక్టర్ నాగేంద్ర యాదవ్, వనపర్తి మార్కెట్ యార్డు డైరెక్టర్ శివ శంకర్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, పెద్దమందడి ఎంపిడిఓ అప్జల్, ఎంఈఓ జయశంకర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.