- Advertisement -
అమెరికాలో మరో తెలుగు యువతి మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూరే నాగశ్రీవందన పరిమళ(26) అనే యువతి మరణించింది. వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ.. ఎంఎస్ చేయడానికి 2022లో అమెరికా వెళ్లింది. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటూ ఎంఎస్ చదువుతున్న పరిమళ.. గత శనివారం రాత్రి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఓ ట్రక్కు, కారును ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి యువతి చనిపోగా.. కారులో ప్రయాణిస్తున్న నికిత్, పవన్ అనే మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. యువతి మృతదేహాన్ని తెనాలికి పంపించేందుకు తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -