Monday, December 23, 2024

గోనె సంచుల కోసం టెండర్లు

- Advertisement -
- Advertisement -

Tenders for Gunny Bags

మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గోనె సంచులకోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని మొత్తం 15కోట్ల గొనె సంచులు అవసరం కాగా ,అందులో ఇప్పటికే బహిరంగ టెండర్ల ద్వారా 8కోట్ల సంచులు సేకరించాలని నిర్ణయించింది. ఈ సంచుల కోనుగోలుకు టెండర్లు ఆహ్వానించింది. మరో 5కోట్లు కొత్త సంచుల సరఫఱా కోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ జూట్ కార్పోరేషన్‌కు లేఖ రాసింది. టెండర్ల ద్వారా కొనుగోలు చేసే గోనె సంచులకు సంబంధించి వాటి సరఫరా దారులు దాఖలు చేసిన బిడ్లను ఈ నెల 25న స్క్రూటిని చేయనున్నారు. అనంతరం తక్కవ ధరకు టెండరు దాఖలు చేసిన వారిని ఎంపిక చేయనున్నట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News