Friday, January 31, 2025

ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి టెండర్లు

- Advertisement -
- Advertisement -

నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డిలోని
గిర్మాపూర్‌యాదాద్రి వరకు ఐదు భాగాలుగా నిర్మాణం
అంచనా వ్యయం రూ.7,104 కోట్లు.. పొడవు 161.5 కి.మీ
నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు

మనతెలంగాణ/హైదరాబాద్: రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో పురోగతి ల భించింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్‌లను పిలిచింది. నా లుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కోసం కేంద్రం ఈ టెండర్‌లను పిలిచింది. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు మొత్తం ఐదు భాగాలుగా నిర్మించనున్న ఈ రోడ్డు నిర్మా ణం కోసం కేంద్రం ఈ టెండర్‌లను పిలిచిం ది. రూ7,104 కోట్లతో 161.5 కి.మీ పొడవునా రహదారి నిర్మాణం పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రా మం వరకు 34.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్

నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు, మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మా ణాన్ని కేంద్రం చేపట్టనుంది. ప్రస్తుతం హైద రాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కి.మీ దూరం నుంచి ఈ ప్రతిపాదిత ఆర్ ఆర్‌ఆర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి-, తూప్రాన్-, గజ్వేల్- చౌటు ప్పల్ వరకు మొత్తం 161 కి.మీ. మేర నిర్మిం చనుండగా ఈ భాగాన్ని మొత్తం ఆరు ప్యాకే జీల్లో నిర్మాణం చేయనున్నారు. దీనికోసం 1,940 హెక్టార్ల భూమి అవసరం అవుతుంద ని అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News