Thursday, April 3, 2025

‘ది కింగ్ ఈజ్ బ్యాక్’

- Advertisement -
- Advertisement -

Tennis legend Federer comeback

మళ్లీ ర్యాకెట్ పట్టిన టెన్నిస్ లెజెండ్ ఫెదరర్
ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన స్విస్ దిగ్గజం

స్విట్జర్లాండ్: టెన్నిస్ లెజెండ్, స్విస్ దిగ్గజం మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ బరిలో దిగనున్నాడు. గతేడాది వింబుల్డన్‌లో గాయంతో వైదొలిగిన తరువాత ఫెదరర్ టెన్నిస్‌కు దూరమయ్యాడు. పలుమార్లు మోకాలి సర్జరీలతో ఏడాదికిపైగా కోర్టుకు దూరంగా ఉన్నాడు. అయితే 20 గ్రాండ్‌స్లామ్‌ల విన్నర్ ఫెదరర్ పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్న నెరవేరేలా కనిపిస్తున్నాయి. 41ఏళ్ల స్విస్ మ్యాస్ట్రో ఆదివారం ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఫెదరర్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ అభిమానులను అలరించాడు. పోస్టు చేసిన గంటవ్యవధిలోనే మిలియన్ లైకులు సొంతంచేసుకుంది. ది కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా లావెర్ కప్‌లో ఫెదరర్ కోసం రఫెల్ నాదల్, జకోవిచ్, ఆండీ ముర్రేతో జతకట్టనున్నాడు. ఈ నలుగురు ఆటగాళ్లు గత రెండు దశాబ్దాలుగా పురుషుల టెన్నిస్‌ను శాసిస్తున్నారు. 76గ్రాండ్‌స్లామ్‌ల్లో 66గ్రాండ్‌స్లామ్‌లను వీరే కైవసం చేసుకున్నారు. 2003 నుంచి ప్రతి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంటున్నారు. కాగా లావెర్ కప్ లండన్ వేదికగా సెప్టెంబర్ 23నుంచి 25వరకు జరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News