Friday, December 20, 2024

భారతీయ విద్యార్థులకు పదిలక్షల అమెరికా వీసాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఈ ఏడాది భారతీయులకు పది లక్షలకు పైగా వీసాలను జారీ చేయాలని అమెరికా అధికార యంత్రాంగం సంకల్పించింది. ఈ దిశలో పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. భారతీయ విద్యార్థులకు వీసా మంజూరీలో ప్రాధాన్యత ఇవ్వాలని బైడెన్ అధికార యంత్రాంగం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది ఆరంభం అయ్యే విద్యాసంవత్సరానికి ముందుగానే భారతీయ విద్యార్థులకు వీసాల మంజూరిని వేగవంతం చేసే వీలుంది.

దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారల పర్యవేక్షకులు దేశ విదేశాంగ శాఖ సహయ మంత్రి డోనాల్డ్ లూ వార్తా సంస్థలకు ఈ వీసాల జారీ విషయం తెలిపారు. వర్క్‌వీసాలైన హెచ్ 1 బి, ఎల్ వీసాలపై కూడా కసరత్తు జరుగుతోందని వివరించారు. ఈ వీసాల ఆధారంగా అమెరికాలో ఐటి ఉద్యోగాలలో స్థిరపడేందుకు ఎక్కువగా భారతీయ యువ ప్రతిభావంతులైన విద్యార్థులకు వీలుంటోంది. ఈ దశలో వీసాల మంజూరీలో భారతీయ విద్యార్థులకు ప్రాధాన్యత అంశం ప్రస్తావనకు వచ్చింది.

అమెరికాలోని పలు ఐటి దిగ్గజ సంస్థలు ఎక్కువగా చైనా, ఇండియాకు చెందిన వేలాది మంది ఐటి నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్నత విద్యకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉంటోంది. ఇండియాలో బిటెక్ ఇతర సంబంధిత సాంకేతిక చదువుల తరువాత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అమెరికాలోనే ఉన్నత విద్యాభ్యాసం చేసుకుంటూ అనుబంధ వీసాలపై ఆధారపడి వివిధ స్థాయిల్లో తాత్కాలిక ఉద్యోగాలతో వృద్ధి చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News