Wednesday, January 22, 2025

పాలస్తీనియన్లకు మద్దతుగా పాక్‌లో జమాతే పార్టీ భారీ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

లాహోర్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ప్రధాన మత రాజకీయ పార్టీ అయిన జమాయతే ఇస్లామీ ఆదివారం లాహోర్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిరసన కారులు ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా జిహాద్ కోసం పిలుపునివ్వడం విశేషం. ఇంతకు ముందు కూడా ఈ పార్టీ కరాచీ, ఇస్లామాబాద్‌లలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించింది. మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది బ్యానర్లు, పోస్టర్లు పట్టుకుని కిలోమీటర్ల దూరం నడిచి ర్యాలీ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా ఇజ్రాయెల్‌కు,

అమెరికాకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలను మేలుకొల్పడమే కాకుండా అమాయకులకు మద్దతుగా వాణిని అందిస్తాయని జమాయతే ఇస్లామీ అధ్యక్షుడు, సెనేటర్ సిరాజుల్ మక్ అన్నారు. ఇస్లామిక్ సహకారం కోసం తమ సంస్థ చేసిన తీర్మానాలు, జారీ చేసిన ప్రకటనలు పని చేయలేవని ఆయన అంటూ, దురాక్రమణదారుడిని ఆపడానికి ముస్లిం పాలకులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News