Monday, December 23, 2024

చంద్రబాబు భద్రతపై ఆందోళన: చిన రాజప్ప

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాజమండ్రి జైలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై తమకు ఆందోళన ఉందని టిడిపి నేత, మాజీ హోంమంత్రి చిన రాజప్ప తెలిపారు. రాజమహేంద్రవరంలో చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబుకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రాజమండ్రి జైలు సూపరింటెండెట్‌ను బదిలీ చేస్తున్నామని వైసిపి లీడర్లు లీకులు ఇస్తున్నారని, జైలును కూడా తమ కంట్రోల్‌లోకి తీసుకునే కుట్ర జగన్ చేస్తున్నారని చిన రాజప్ప ధ్వజమెత్తారు. జైలు లోపలి అంశాలను సాక్షి, అనుబంధ మీడియాకు లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. జరుగుతున్న పరిణామాల పట్ల రాజ్యాంగ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News