- Advertisement -
తిరుపతి: వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోశాలకు బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. భూమన, వైసిపి నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే టిటిడి గోశాలకు కూటమి నేతలు చేరుకున్నారు. గోశాలకు భూమన రావాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు.
టిటిడి గోశాలలో ఆవుల మృతిపై వైసిపి నేతల సవాళ్లకు కూటమి నేతలు ప్రతి సవాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. గోవుల మృతిపై కూటమి నేతలు తలో మాట మాట్లాడుతున్నారని, గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుందని దుయ్యబట్టారు. తనని రమ్మన్నవాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని భూమన ప్రశ్నించారు.
- Advertisement -