Saturday, December 21, 2024

బొమ్మలరామారం పిఎస్ వద్ద ఉద్రిక్తత… ఎంఎల్‌ఎ రఘునందన్ రావు అరెస్టు

- Advertisement -
- Advertisement -

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త చోటుచేసుకుంది. బండి సంజయ్‌ని పరామర్శించేందుకు వచ్చిన ఎంఎల్‌ఎ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదం చేయడంతో తోపులాట జరిగింది. సంజయ్ ఎందుకు అరెస్టు చేశారని చెప్పాలని రఘునందన్ రావు పోలీసులను అడిగారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అదుపులోకి తీసుకొని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసు కస్టడిలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వెళ్లిన లీగల్ టీమ్ కు స్టేషన్ లోకి పోలీసులు నో ఎంట్రీ చెప్పేశారు. అడ్వకేట్లకు సెక్షన్ 35 ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తితో మాట్లాడే హక్కు ఉందని కాబట్టి తమను బండి సంజయ్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండని స్టేషన్ లోపలకు రావల్సిన అవసరం లేదంటూ పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. తమతో వాదనలు చేయవద్దని కోర్టుకెళ్లాలని పదే పదే పోలీసు అధికారి అడ్వకేట్స్ తో చెప్పడం గమనార్హం. అయితే తాము ఖచ్చితంగా బండి సంజయ్ తో మాట్లాడుతామని లీగల్ టీమ్ వాదిస్తోంది. ఏ సెక్షన్ లో సంజయ్ ని కస్టడీలోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు లేకుండా తామెలా కోర్టును ఆశ్రయిస్తామంటూ అడ్వకేట్లు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలు కూడా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News