Friday, January 10, 2025

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

నగనరంలో చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం సాయంత్రం నుంచే గ్రంథాలయానికి భారీగా గ్రూప్స్, డిఎస్‌సి పరీక్ష అభ్యర్థులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గ్రూప్ 2, 3, డిఎస్‌సి వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అయితే అప్పటికే భారీగా పోలీసులు బలగాలు లైబ్రరీ వద్దకు చేరుకున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు నిరుద్యోగుల ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

నిరుద్యోగులపై పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం : హరీశ్‌రావు
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. గ్రూప్స్, డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు..నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని, ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News