Wednesday, January 22, 2025

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీభవన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత వాతవారణం నెలకొంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో బాధితుడు మాట్లాడుతూ తన పేరు భాస్కర్ అని, మక్తల్ నియోజకవర్గం చిత్తనూరు గ్రామానికి చెందిన వ్యక్తినని వెల్లడించాడు. తన గ్రామాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన కోరారు. తమ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయవద్దని, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే తమ ఊరికి నష్టం జరుగుతుందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయకుండా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను భాస్కర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News