- Advertisement -
నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
అడ్డుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి ప్రదర్శన చేయడానికి గాంధీ భవన్ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు బయలు దేరారు. మరోవైపు డిసిసి అధ్యక్షుడు అనిల్ యాదవ్, నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తల యత్నించారు.
ఈ క్రమంలోనే వారిని పోలీసులు గాంధీభవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు బారీకేడ్లను అడ్డుపెట్టారు. దీంతో బారీకేడ్లు ఎక్కి మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
- Advertisement -