Monday, January 20, 2025

గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండలో గీతం యూనివర్సిటీ దగ్గర మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గీతం ప్రాంగణాన్ని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి జెసిబిలతో యూనివర్సిటీలో రెవెన్యూ అధికారులు హడావుడి చేయడంతో గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమితో పాటుగా మార్కింగ్ చేసిన భవనాలు, ప్రహరీ కూల్చేందుకు యత్నించారు. మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు జెసిబిలు, సిబ్బందితో రెవెన్యూ శాఖ వెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగ గంటల నుంచి ఎండాడ, రుషికాండ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గీతం యూనివర్సిటీకి దారితీసే అన్ని మార్గాలను మూసివేశారు. గీతం యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Also Read: దటీజ్ కెసియార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News