Monday, January 20, 2025

మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మహా నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్‌ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులు ఆందోళన విరమించుకోవాలని సూచించారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News