Sunday, December 22, 2024

నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం 9.10 గంటలకు రాత్రి కన్నుమూశారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన పిజి వైద్య విద్యార్థినికి నిమ్స్‌లో చికిత్స అందించారు.

ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు ప్రీతి తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతి మృతితో నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాలతో పాటు గిరిజన సంఘాలు, బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో నిమ్స్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News