Sunday, November 24, 2024

ఎంఎల్ఎ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తతత

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బిఆర్‌ఎస్ నాయకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీ మారనున్నట్లు తెలియడంతో బిఆర్‌ఎస్ నాయకులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో 12మంది నాయకులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు శుక్రవారం వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన కుమారుడిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లారు. అదే సమయంలో బిఆర్‌ఎస్ నాయకులు పోచారం ఇంటిలోకి దూసుకుని వెళ్లారు.

దీంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోచారం ఇంటి వద్ద అరెస్టు చేసి బిఆర్‌ఎస్ నాయకులు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్ రెడ్డి, వాసుదేవారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయ గౌడ్, క్డారి స్వామి యాదవ్, తుంగా బాలు, డి. రాజు, జంగయ్య, వరికుప్పల వాసు, చత్తారి దశరథ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై కేసు నమోదు చేశారు. నాయకులను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. అనంతరం వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

పోలీసులపై సిఎం ఆగ్రహం….
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉండగానే బిఆర్‌ఎస్ నాయకులు ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లారు. దీంతో భద్రతా వైఫల్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసుల భద్రత చర్యలు వైఫల్యం చేందడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ పోచారం ఇంటికెళ్లి విచారణ చేపట్టారు. బాల్క సుమన్ సహా బీఆర్‌ఎస్ నేతలు చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ నేతలపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే పోచారం నివాసానికి సిఎం సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్లి విచారణ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News