Thursday, January 16, 2025

పద్మాలయ స్టూడియో దగ్గర ఉద్రిక్తత.. అభిమానుల తోపులాట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పద్మాలయా స్టూడియోస్‌లోని బారికేడ్లు దాటి ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సినీనటుడు కృష్ణ భౌతికకాయానికి తుది నివాళులర్పించేందుకు ఆయన అనుచరులు వేలాదిగా పద్మాలయ స్టూడియోస్‌కు తరలి వస్తున్న సంగతి తెలిసిందే.

పోలీసులు వారిని అడ్డుకోవడంతో పాటు వీఐపీల రద్దీ ఎక్కువగా ఉందని పేర్కొంటూ నటుడి భౌతికకాయాన్ని సందర్శించేందుకు అనుమతించకపోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన అభిమానులు బారికేడ్లను తోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఒకరు గాయపడినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News