Sunday, December 22, 2024

రణరంగంగా మారిన ఎపి ఎన్నికలు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టిడిపి ఎజెంట్లను పలు చోట్లు వైసిపి నేతలు కిడ్నాప్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాలో హైటెన్షన్ నెలకొంది. వైసిసి, టిడిపి కార్యకర్తలు గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్‌పై వైసిపి అభ్యర్థి శివ కుమార్ దాడి చేశారు. దీంతో వైసిపి అభ్యర్థి శివ కుమార్ చెంపను ఓటర్ చెల్లుమనిపించాడు. క్యూలైన్‌లో కాకుండా నేరుగా వైసిపి అభ్యర్థి వెళ్లడంపై ఓటర్లు అభ్యంతరం వ్యకం చేశారు. ఓటరుపై శివకుమార్ అనుచరులు విచక్షణారహితంగా దాడులు చేశారు. ప్రకాశం దర్శి నియోజకవర్గంలోని బొడ్డపాడులో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల నాయకులు కుర్చీలతో కొట్టుకోవడంతో పోలింగ్ ఆగింది. ఈ ఘటన చిత్రీకరిస్తున్న పలు టివి రిపోర్టర్లపై టిడిపి, వైసిపి నేతలు దాడులు చేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లెలో టిడిపి ఏజెంట్ సుభాష్‌పై వైసిపి నేతలు దాడులు చేశారు. ఈ దాడిలో సుభాష్ కన్ను కోల్పోయాడు. స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని సుభాష్ ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News