Sunday, January 19, 2025

బండి పర్యటన.. ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని చెంగిచర్ల విచ్చేసిన ఆయన అక్కడ పోలీసులు బారికేడ్లు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంగిచర్ల నిషేధిత ప్రాంత మా మనం పాకిస్తాన్‌లో ఉన్నమా, బంగ్లాదేశ్ లో ఉన్నామా బాధితులంతా పేదలు. తిండికి లేక అల్లాడుతున్నవాళ్లు వాళ్లను ఆదుకోవడానికి వచ్చే వాళ్ల ను కూడా అడ్డుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది బిజెపి కార్యకర్తలు, హిందుత్వ వాదులు తరలివచ్చారు. జై శ్రీరాం నినాదాలు చేస్తూ బండి సంజయ్‌తో కలిసి బాధితుల వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్త లు బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో బండి సంజయ్ పడిపోతుండగా కార్యకర్తలు పట్టుకున్నారు..

అనంతరం పోలీసుల ఆంక్షల మధ్య కొద్దిమంది కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి పరామర్శించి దాడులకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెంగిచర్లలో జరిగిన వాస్తవాలను బయటకు వెళ్లకుండా పేద ప్రజలదే తప్పు అన్నట్లుగా పోలీసులు, కొందరు చిత్రీకరించే యత్నం చేస్తున్నారని, నిజాం పాలనలో మహిళలపై అకృత్యాలకు జరిగాయని, కెసిఆర్ పాలనలో రజాకార్ల పాలనను చూపించారని విమర్శించారు. హోలీ పండుగ రోజు భక్తి పాటలతో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఇక్కడి ఎస్టీ సామాజికవర్గ ప్రజలకు ఉందని, కానీ కొందరు రోహింగ్యాలు, పోకిరీలు ఇక్కడికి వచ్చి పాటలు ఆపాలంటూ బెదిరించి, వందల మంది సంఘ విద్రోహ శక్తులు మూకుమ్మడిగా బాధితుల ఇండ్లపైకి వచ్చి మరణాయుధాలతో దాడి చేశారని మండిపడ్డారు. వాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు, బాధితులు మసీదుకు, రోహింగ్యాలు ఉన్న ప్రాం తానికి వెళ్లలేదని, వాళ్లే బాధితుల వద్దకు వచ్చి దౌర్జన్యం చేసి చిన్నా పెద్దా మహిళలనే తేడా లేకుండా విచక్షణా రహితంగా దాడులు చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News