Thursday, December 26, 2024

హుజూరాబాద్‌లో ఉద్రిక్తత..పోలీసులపై కెటిఆర్, హరీశ్ రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. కొంతమంది దళితులతో కలిసి వచ్చిన కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి భారీగా వచ్చిన పోలీసులు.. కౌశిక్ రెడ్డితోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగింది. దీంతో కౌశిక్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు తీవ్రంగా స్పందించారు. దళిత బంధు ఇవ్వాలని అడిగినందుకు ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? అంటూ పోలీసులు, సర్కార్ పై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News