Thursday, April 3, 2025

సిఎఎపై తొలి నిరసన.. జామియా క్యాంపస్‌లో నినాదాలు ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

కేంద్రం అమలులోకి తెచ్చిన సిఎఎపై స్థానిక జామియా మిలియా ఇస్లామిక్ విద్యాసంస్థ క్యాంపస్‌లో నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయింత్రం సిఎఎ అమలు నోటిఫికేషన్ తీసుకువచ్చిన వెంటనే విద్యార్థులు గుమికూడారు. నిరసనలకు దిగారు. దీనితో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) సారధ్యంలో విద్యార్థులు ప్రదర్శనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి , ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యుఐ కూడా సిఎఎ అమలును వ్యతిరేకిస్తూ ప్రకటన వెలువరించింది.

క్యాంపస్‌లో పరిస్థితి తెలియగానే అక్కడికి ఢిల్లీ పోలీసు అధికార యంత్రాంగం స్పందించింది. హుటాహుటిన క్యాంపస్‌కు పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. శాంతిభద్రతల పరిరక్షణ కీలకం అని అధికారులు తెలిపారు. ఉద్యమాలు, నిరసనలను అనుమతించేది లేదని, క్యాంపస్‌లో వీటికి తావివ్వబోమని విద్యాసంస్థ వైస్ ఛాన్సలర్ ఇక్బాల్ హుస్సేన్ ప్రకటించారు. క్యాంపస్‌లో కానీ దరిదాపుల్లో కానీ ఉద్యమాలకు అనుమతించేది లేదన్నారు. పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News