Saturday, April 5, 2025

కడపలో ఉద్రిక్తత… వేదికపై కుర్చీకోసం టిడిపి, వైసిపి వార్‌

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేదికపై మేయర్‌ సురేష్ బాబుకు మాత్రమే కార్పొరేషన్‌ సిబ్బంది కుర్చీ వేశారు. సీటు లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస తెలిపారు. ఎమ్మెల్యే మాధవి భారీ అనుచర వర్గంతో ర్యాలీగా కడప కార్పొరేషన్‌ చేరుకున్నారు. కార్పొరేషన్‌ గేట్ వద్ద టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

కాసేపట్లో కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం కానుంది. కార్పొరేషన్‌ కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ముందస్తుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ దగ్గర 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు ర్యాలీలు, సభలను పోలీసులు నిషేధించారు. వేదికపై కుర్చీకోసం వైసిపి, టిడిపి మధ్య యుద్ధం నడుస్తోంది. అప్పట్లో వాయిదాపడిన సమావేశాన్ని అధికారులు ఇవాళ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News