Monday, December 23, 2024

కొండపిలో టిడిపి-వైసిపి నిరసన…. టెన్షన్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి ఎంఎల్‌ఎ వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసిపి యత్నిస్తోంది. అశోక్‌బాబు ఆధ్వర్యంలో నాయుడుపాలెం వెళ్లేందుకు వైసిపి కార్యకర్తలు యత్నిస్తున్నారు. నాయుడుపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. గతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని వైసిపి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గతంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వైసిపి నిరసన చేసింది.

Also Read: అర్థరాత్రి ఒంటరిగా అబల…. బైక్ ఫై పోకిరీలు… వీడియో చూస్తే మైండ్ బ్లాక్

వైసిపి కార్యకర్తల తీరుకు నిరసనగా టిడిపి ఆందోళన చేపట్టింది. టిడిపి, వైసిపి పోటీగా నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. నాయుడుపాలెంలో టిడిపి ఎంఎల్‌ఎ డోలా బాలవీరాంజనేయస్వామిని అరెస్టు చేశారు. ఎంఎల్‌ఎ స్వామిని అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. టంగుటూరు, నాయుడుపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అశోక్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అశోక్‌బాబును పోలీసులు కందుకూరు అదుపుతోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నాయుడుపాలెం వెళ్లకుండా అశోక్ బాబును పోలీసులు అడ్డుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News