Wednesday, January 22, 2025

కోస్గిలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు

పరస్పరం ఇరువర్గాల రాళ్ల దాడి

పలువురికి గాయాలు

ఆందోళనకారులపై లాఠీఛార్జి

మన తెలంగాణ/కోస్గి/హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో మంగళవా రం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. మండలంలోని సర్జాఖాన్‌పేట్ గ్రామంలో బిఆర్‌ఎస్ నేత సోమశేఖర్‌రెడ్డి వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఆయన వాహనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి పరస్పరం ఫి ర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎం ఎల్‌ఎ బిఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఎ నరేందర్‌రెడ్డి తన అనుచరులతో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టగా మరోవైపు కాంగ్రెస్ శ్రేణు లు శివాజీ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తూ పరస్ప రం ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఈ ఆందోళనలు తీవ్ర స్థా యికి చేరడంతో పరస్పరం ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ రాళ్లదాడిలో ఇరు పార్టీల కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐ జనార్ధన్ మాట్లాడుతూ ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఓటమి భయంతోనే దాడులు : నరేందర్‌రెడ్డి
కొడంగల్‌లో ఓటమి భయంతోనే రేవంత్‌ రెడ్డి వర్గీయులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలోనే భాగంగానే ఆ గ్రామంలో సోమశేఖర్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. మొదట కాంగ్రెస్ కార్యకర్తలకే దాడులకు పాల్పడి ఆ తప్పును బిఆర్‌ఎస్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్, కర్నూల్ నుంచి గుండాలను తీసుకొచ్చి వారితో బిఆర్‌ఎస్ పార్టీ కార్ల అద్దాలు ధ్వంసం చేయించి వారితోనే బిఆర్‌ఎస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

ప్రశాంతంగా ఉన్న కొడంగల్ పల్లెలలో అధికార దాహంతో, దురాశతో రేవంత్ రెడ్డి దౌర్జన్యాలను చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. నలుగురు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయని వారిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని ఆయన తెలిపారు. దొంగ తానే దొంగ దొంగ అన్నట్టు గత వారం రోజులుగా తామే సమస్యలను సృష్టించి అది మా పార్టీ మీద నెట్టుతున్నారని నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. అమాయక ప్రజలను బలి తీసుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయేనని రేవంత్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News