Sunday, January 26, 2025

మంచిర్యాలలో ఉద్రిక్త వాతావరణం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : బిఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి కి నిరసనగా మంచిర్యాల పట్టణం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బిఆర్ఎస్ యువనేత విజిత్ కుమార్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా బిఆరెస్ యువనేత విజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే తన అనుచర రౌడీ గ్యాంగ్‌ను మంచిర్యాల వీధుల్లో వదిలి బిఆరెస్ కౌన్సిలర్ శ్రీరాముల మల్లేష్ ఇంటిపై దాడి చేసి, అడ్డువచ్చిన కుమారుడిని గాయపరిచి,

వృద్ధురాలైన వారి అమ్మగారిని కాలితో తొక్కి దుర్భాషలు ఆడిన కాంగ్రెస్ కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుండా రాజ్యం నడిపే ప్రేమ్ సాగర్ ని మంచిర్యాల నుండి తరిమేయాలని అన్నారు. విషయం తెలుసుకున్న  వెంటనే హుటాటిన సంఘటన స్థలానికి చేరుకున్నా పట్టణ సిఐ రాజు ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసిపి తిరుపతిరెడ్డి పరిస్థితిని అదుపు చేసి దాడి చేసిన వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు నిరసన విరమించుకున్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News