Sunday, December 22, 2024

నార్సింగిలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి పోచారం గుట్ట వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం హనుమాన్ దేవాలయం కబ్జా చేసింది. గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వాదం నెలకొంది. కబ్జా కోరులు జేసీబీల తో దేవాలయం భూమిని పదును చేయడానికి పనులు ప్రారంభించారు. స్థానికుల సమాచారంతో రంగ ప్రవేశం చేసిన నార్సింగి పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు. రెండు జేసీబీల సీజ్ చేశారు. గుండాలు, ప్రైవేటు బౌన్సర్లు గతంలో స్థానికులపై రాళ్ల దాడి చేశారని వారిపై కఠన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News