- Advertisement -
హైదరాబాద్: పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపిలు నిరసన వ్యక్తం చేశారు. కలర్‌స్మోక్ ఘటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్‌సభకు హోంమంత్రి అమిత్ షా రావాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలోని పొడియం దగ్గరికి టిఎంసి ఎంపి ఒబ్రయిన్ దూసుకెళ్లి నినాదాలు చేశారు. టిఎంసి పక్షనేత ఒబ్రయిన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది.
కలర్‌స్మోక్ ఘటన విషయంలో పార్లమెంట్ భద్రతా సిబ్బందిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
- Advertisement -