Monday, December 30, 2024

రెడ్డప్ప ఇంట్లో ఎంపి మిథున్ రెడ్డి ప్రత్యక్షం… పుంగనూరులో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో అడుగు పెట్టడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు వికటించాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులో మాజీ ఎంపి రెడ్డప్ప ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎవరికీ తెలియకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పుంగనూరు వచ్చేశారు. ఈ విషయం తెలియడంతో నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి వైసిపి కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టిడిపి, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News