Saturday, November 9, 2024

రాజ్యసభ సభలో గందరగోళం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై సభలో గందరగోళం కారణంగా రాజ్యసభ శుక్రవారం ఎలాంటి కార్యకలాపాలు జరపకుండానే వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభం కాగానే అధికార పక్ష సభ్యులు రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ జరగాలని పట్టుబట్టగా, ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేయసాగారు. ఇరు పక్షాలు కూడా తాము లేవనెత్తిన అంశాలపైనే చర్చ జరగాలని పట్టుబట్టడంతో చైర్మన్ జగదీశ్ ధన్‌కర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే అధికా పక్ష సభ్యులు రాజస్థాన్‌లో మైనర్ బాలిక హత్య ఘటనను ప్రస్తావిస్తూ ఆ రాష్టలో శాంతి భద్రతల పరిస్థితిపై సభ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికను హత్యచేసిన అనంతరం బొగ్గు బట్టీలో తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని కూడా స్థానికులు అంటున్నారు. రాజస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, శాంతిభద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సభ నాయకుడు పీయూష్ గోయల్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపిస్తూ రాష్ట్రంలో మన కుమార్తెలు, అక్కా చెల్లెళ్లు క్షేమంగా లేరని, ఈ అంశంపై చర్చ చేపట్టాలని చైర్మన్‌ను కోరుతున్నానని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడడానికి చైర్మన్ అనుమతించడంతో అధికార పక్ష సభ్యులు గొడవ చేయడం ప్రారంభించారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News