Wednesday, January 22, 2025

షాద్ నగర్ లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం బసవ ఆలయంలో గురువారం రాత్రి విధ్వంసకులు శివ లింగాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.  ఈ ఆలయం షాద్‌నగర్‌లోని జానపేటలోని వివేకానంద కాలనీలో ఉంది. మతపరమైన ప్రాముఖ్యత కలిగిన లింగాన్ని శుక్రవారం ఉదయం ధ్వంసం చేసినట్లు స్థానిక భక్తులు గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిదేమి కాదు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని ఆలయాలను కూడా ఇంతకు ముందు ఇలాగే లక్ష్యం చేసుకున్నారు. ఈ వార్త వ్యాప్తి చెందడంతో, స్థానిక హిందూ మత సంస్థలు ఆలయానికి చేరుకుని నిరసన ప్రారంభించాయి. పోలీసులు ఆలయానికి వచ్చి విచారణ ప్రారంభించారు. ఆలయ ధ్వంసం ఘటనలపై రంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన నిరసనల దృష్ట్యా పోలీసుల భద్రతను కూడా పెంచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News