- Advertisement -
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల రద్దుతో 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తామని కెసిఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవులపై సిఎస్, ఉన్నతాధికురులతో సిఎం కెసిఆర్ సమీక్షలు జరిపారు. 1 నుంచి 9వ తరగతి చదువుతున్న 53.79 లక్షలకు పైగా విద్యార్థులను పై తరగతులను ప్రమోట్ చేశామన్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఎప్పుడు తెరిచేది జూన్ 1 తరువాత నిర్ణయిస్తామని ప్రకటించారు.
- Advertisement -