Monday, December 23, 2024

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఎఎన్‌ఎంను, ఒక ఆశా వర్కర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లతో సిద్దంగా ఉంచామని అన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కోరారు. అలాగే విద్యార్థులు ఇబ్బంది పడకుండా బస్సులు నడపాలని ఆర్‌టిసిని కోరారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా తగిన చర్కలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆరు పేపర్లకు పరీక్ష

రాష్ట్రంలో టెన్త్ పరీక్షలకు ఆరు పేపర్లకు విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు టెన్త్ పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తుండగా, ఇప్పుడు ఆరు పేపర్లకు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చివరి 15 నిమిషాల్లో మాత్రమే ‘బిట్ పేపర్’ ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇస్తారు. జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలను ఒకే సమయంలో కాకుండా నిర్ణీత సమయంలో విద్యార్థులకు వేర్వేరుగా ఇస్తారు. ఇందులో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్ సైన్స్ కాగా రెండోది బయాలాజికల్ సైన్స్.

విద్యార్థులు ఒక జవాబుపత్రంలో భౌతికశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలను, మరో జవాబుపత్రంలో జీవశాస్త్రం జవాబులను రాయాల్సి ఉంటుంది. ఉదయం 9.30 గంటల పరీక్ష ప్రారంభం కాగానే విద్యార్థులకు మొదట భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రం ఇస్తారు. జనరల్ సైన్స్ పేపర్‌కు సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ తర్వాత 20 నిమిషాల సమయంలో ఈ పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను సేకరించి, విద్యార్థులకు రెండో పేపర్ ఇస్తారు. రెండో పేపర్ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇక, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

విద్యార్థులకు సూచనలు

సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు.

రైటింగ్‌ప్యాడ్, అవసరమైన పెన్నులు, పెన్సిల్ తీసుకెళ్లాలి.

విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి

ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ రాయాలి.

అదనపు సమాధాన పత్రాలు, గ్రాఫ్, బిట్ పేపర్లు విడిపోకుండా సమాధాన పత్రంతో గట్టిగా ధారంతో కట్టాలి.

డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News